- Advertisement -
ప్రభుత్వ భూమి కబ్జా
Government land acquisition
కబ్జాదారులను శిక్షించాలి
నల్గోండ
నల్గొండ జిల్లా చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామంలో సర్వే నెం.34 లో 18 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన భూ బకాసురులను తక్షణమే శిక్షించాలని శివనేని గూడెం మాజీసర్పంచ్, కాంగ్రెస్ నేత దేవనక దేవేందర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ… గ్రామానికి సంబంధం లేని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కబ్జా కోరులు ప్రభుత్వ గుట్టలను అక్రమంగా ఆక్రమించుకొనిమట్టిని విక్రయిస్తున్నారని ఆరోపించారు. స్థానిక తహశీల్దార్ కృష్ణయ్య, ఆర్ఐ లకు పిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని తెలిపారు. ఇటాచిమిషన్లతో గుట్టలను ధ్వంసం చేస్తూ మట్టిని విక్రయిస్తున్నా పట్టించుకోవడంలేదన్నారు. తద్వారా కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని గండికొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుట్టల వెనుక వ్యవసాయం చేసుకుంటున్న రైతులను వారి పొలాల్లోకి పోనివ్వడం లేదని వాపోయారు. చేతికొచ్చిన పంట పొలాలు ఎండి పోయి రైతులు ఏమి చెయాలో తోచక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఈ విషయంపై రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి, రెవిన్యూ సిబ్బందికి, జిల్లా కలెక్టర్,ఆర్.డి.ఓ దృష్టికితీసుకువచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కోట్లాది రూపాయల విలువైన భూమిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు…
- Advertisement -