పంట నమోదుతోనే రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు…
ఏవో రవి
మద్దికేర
Government schemes applicable to farmers with crop registration…
పంట నమోదు ద్వారానే రైతులకు ప్రభుత్వం అందజేసే ప్రభుత్వ పథకాలు అందుతాయి అని మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి తెలియజేశారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ 2024 సంవత్సరానికి సంబంధించి రైతులందరూ తమ సాగు చేసిన పంటలను అధికారుల ద్వారా పంట నమోదును చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. పంట నమోదు కొరకు రైతులు పొలం పాస్ బుక్, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లను తీసుకుని వచ్చి రైతు సేవా కేంద్రాలలో పంట నమోదును చేసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా మద్దికేర మండల పరిధిలోని గల మద్దికేర పడమర మరియు ఉత్తరం నందు వ్యవసాయ అధికారులు నిర్వహిస్తున్న పంట నమోదు కార్యక్రమం ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు జాకీర్ హుస్సేన్,రాణి మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.