Sunday, September 8, 2024

ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది: మంత్రి  డి శ్రీధర్ బాబు

- Advertisement -

ఐ టి పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల  శాఖ మంత్రి  డి శ్రీధర్ బాబు

ప్రజాదర్బార్ లో వినతులు స్వీకరించిన మంత్రి

దరఖాస్తులపై పూర్తి అడ్రస్, సెల్ ఫోన్ నంబర్, వివరాలు రాయాలని సూచించిన మంత్రి

హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కు విజ్ఞాపన పత్రాలతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజాదర్బార్ కు వచ్చిన ప్రజల  సమస్యలను తెలుసుకుని వారి నుంచి వినతులను రాష్ట్ర ఐ టి , పరిశ్రమలు ,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి  డి శ్రీధర్ బాబు స్వీకరించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిషరిస్తుందని తెలిపారు. పెద్దలు, వివిధ వర్గాలతో నెల రోజుల పాటు ప్రజా సమస్యలను కూలంకషంగా చర్చించి మానిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. పారదర్శకంగా, జవాబుదారీతనంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు తమ విజ్ఞాపనపత్రంలో సమస్యతో పాటు అడ్రస్, ఫోన్ నంబర్ ను రాయాలని సూచించారు. తద్వారా దరఖాస్తుదారుల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి , పరిష్కరించడానికి వీలవుతుందని తెలిపారు. ఈ నెల 17 న నిర్వహించనున్న టీఎస్ జెన్కో ఏఈ  పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అదే రోజు రెండు, మూడు పరీక్షలు వున్నట్లు అభ్యర్థులు వివరించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికితీసుకు వెళ్లనున్నట్లు తెలిపారు .సంబంధిత అధికారులతో చర్చించి  పరీక్ష వాయిదాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. తమకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రతి నెలా రెగ్యులర్ గా ఇవ్వాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులు విజ్ఞాపన పత్రం అందజేశారు. అన్ని సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Government will do justice to all: Minister D Sridhar Babu
Government will do justice to all: Minister D Sridhar Babu

విజ్ఞాపనదారుల సౌకర్యార్థం ప్రజాదర్బార్ నిర్వహణకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

ప్రజాదర్బార్ నిర్వహణను జి హెచ్ ఎం సి కమిషనర్ రోనాల్డ్ రాస్  సమన్వయం చేశారు. ఆయుష్ విభాగం డైరెక్టర్ హరిచందన, సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి ముషారఫ్ అలీ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిసెట్టి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్