- Advertisement -
గవర్నర్ తీరును తప్పు పట్టిన మంత్రి జగదీష్
హైదరాబాద్: ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఫైల్ ను గవర్నర్ తిరస్కరించడంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. గవర్నర్ తప్పుడు నిర్ణయం తీసుకుని సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. గవర్నర్ అయ్యే సమయానికి ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలిగా లేరా..? బీజేపీ నుంచి గవర్నర్ గా వచ్చి.. ఎదుటి వారిని పార్టీ పేరుతో తిరస్కరించడం సమంజసం కాదు. గవర్నర్ తీరు గురువింద తీరుని తలపిస్తుంది. గవర్నర్ చెప్పే నీతొ ఆమెకూ వర్తిస్తుంది. తిరస్కరణ నీతి లెక్కన చూస్తే.. ఆమె గవర్నర్ కి అర్హురాలు కారు కదా..! నీతులు చెప్పే గవర్నర్ నైతిక విలువలు పాటిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.
- Advertisement -



