ఫిబ్రవరి 1 నుండి ప్రభుత్వ ఉద్యోగులు హెల్మెట్ ధరించాలి..

- Advertisement -

ఫిబ్రవరి 1 నుండి ప్రభుత్వ ఉద్యోగులు హెల్మెట్ ధరించాలి..

Govt employees to wear helmet from February 1

హెల్మెట్ తప్పని సరి..లేకుంటే సాధారణ సెలవుగా పరిగణింపు..
ద్విచక్ర వాహనం కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు హెల్మెట్ ధరించి మిగిలినవారికి ఆదర్శంగా నిలవాలి..
కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు
జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు వాహనాలపై వచ్చే ఉద్యోగులు ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేకపోతే సాధారణ సెలవుగా పరిగణించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. సోమవారం స్ధానిక జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భధ్రతా నియమాలు అనుసరించి ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు.  ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోని ద్విచక్రవాహనం కలిగిన ఉద్యోగులు హెల్మెట్ ధరించి కార్యాలయాలకు హాజరై అందరికి ఆదర్శంగా నిలవాలన్నారు.  వాహన చోదకుల నిర్లక్ష్యం,ఇతర కారణంగా ప్రమాదాలతో వారి కుటుంబాలకు తీవ్ర మనోవేధనకు గురిచేస్తున్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని రోడ్డు భధ్రతా నియమాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు.  ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఇప్పటికే ఈవిషయంపై అన్నిస్ధాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.  హెల్మెట్ ధారణపై మరింత విస్త్రృత చర్యల్లోభాగంగా తొలిగా ప్రభుత్వ కార్యాలయాలకు వాహనాలపై వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలన్నారు.  రోడ్డు భధ్రతా నిబంధనలను ప్రజలతోపాటు అధికారులు కూడా తప్పనిసరిగా పాటించాలన్నారు. కార్యాలయాల్లో ఉద్యోగులందరూ విధిగా హెల్మెట్ ధారణపై సూచించిన మేరకు రావల్సివుంటుందన్నారు. అదే విధంగా కళాశాలలకు వచ్చే విద్యార్ధులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి రవాలనే నిబంధన ఆయా యాజమాన్యాలు అమలుచేయాలన్నారు.  కళాశాలకు వచ్చే వాహనదారులు హెల్మెట్ ధరించి రాకపోతే నో ఎంట్రీ అని స్పష్టం చేయాలన్నారు.  ఒకటికి రెండుసార్లు తొలిగా హెచ్చరించి తదుపరి కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఆయా కళాశాలల్లో నో హెల్మెట్-నోఎంట్రి విధానం అమలు అవుతున్నదీ లేనిదీ సంబంధిత అధికారులు పరిశీలించాలన్నారు.
సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular