పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం
యువజన కాంగ్రెస్ నాయకులు పొ నుగోటి నరేందర్
సూర్యాపేట, మే18 (వాయిస్ టుడే ప్రతినిధి.)
పట్టభద్రుల గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని యువజన కాంగ్రెస్ నాయకులు పొనుగోటి నరేందర్ అన్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, ఆధ్వర్యంలో పార్లమెంటరీ వ్యాప్తంగా 7 నియోజకవర్గాలలో ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు .. తీన్మార్ మల్లన్న ఒక జర్నలిస్టుగా ప్రజా నాయకుడిగా 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లి ఎండగట్టాడని అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టభద్రులు ప్రచారంలో పాల్గొని తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.