- Advertisement -
వర్షంలో ధాన్యం… రైతు కంట కన్నీరు
Grain in the rain... Tears in the eyes of the farmer
అమరావతి
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధాన్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు. కల్లం లోకి రాంగానే కొనేయండి అని అధికారులను ఆదేశించినా తాడేపల్లి మండల అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.
ఉండవల్లి గ్రామ రైతులు వరి ధాన్యాన్ని దేవాదాయ శాఖ భూముల్లో పోసి వర్షాలు పడే విధంగా ఉన్నాయి త్వరగా ధాన్యాన్ని కొనండి అని రైతు భరోసా అధికారులను అడగగా అధికారులు చాలా నిర్లక్ష్యంగా ధాన్యంలో అక్కడక్కడ మట్టి గడ్డలు ఉన్నాయి అవి కూడా తొలగించి రండి అని నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో రైతులు కంగు తిన్నారు. ఉండవల్లి అధికారుల నిర్లక్ష్యానికి వానలో ధాన్యం తడిసింది. సన్నని జల్లు భారీ వర్షంగా మారకముందే ఉన్నత అధికారులు కలగజేసుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఉండవల్లి గ్రామ రైతులు కోరుతున్నారు.
- Advertisement -