- Advertisement -
సమస్యలు పరిష్కార దిశగా గ్రామ సభ సర్పంచ్ పాల్ దినాకర్
Gram Sabha Sarpanch Pal Dinakar towards solving the problemsకౌతళం
ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ అధ్వర్యంలో సర్పంచ్ యస్. పాల్ దినకర్ అధ్యక్షతన మరియు ప్రభుత్వ అధికారుల సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు “గాంధీ జయంతి “సందర్భంగా “గ్రామ సభ” ఏర్పటు చేయడం జరిగింది. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సభ లో గత సంవత్సరంలో జరిగిన పనుల మరియు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కేటాయింపు గురించి మరియు రాబోయే రోజుల్లో జరగబోయే పనుల గురించి చర్చించడం జరిగింది. మరియు ఆరోగ్యశాఖ అధికారి వారి ద్వార ఆరోగ్యపరమైన సూచనలు వినివించడం,శానిటేషన్, ప్రభత్వపరంగా వస్తున్న పథకాలు అమలు విధానం గురించి చర్చించడం, నీటి సమస్య , వివిధ రకాల సచివాలయం నుంచి పథకాలు గురించి సచివాలయం సిబ్బంది ద్వారా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, వివిధ శాఖకు సంబంధించిన అదికారులు మరియు సచివాలయం సిబ్బంది,పంచాయతీ సిబ్బంది, ప్రజా ప్రతినిదులు, గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.
- Advertisement -




