ఘనంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బర్త్ డే వేడుకలు
జగిత్యాల
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత,
కరీంనగర్ పట్టభద్రుల శాసన మండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పాత్రికేయులు శుక్రవారం ఆనందోత్సాహాల మధ్య జరుపు కున్నారు.
జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు,ఎన్నం కిషన్ రెడ్డి, పాత్రికేయులు పెండెం మహేందర్, పాత్రికేయుల ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి 73 వ జన్మదిన వేడుకలను జగిత్యాల అంబెడ్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ యువ నాయకులు తాటిపర్తి రాంచంద్రా రెడ్డి, తాటిపర్తి
పరిక్షిత్ రెడ్డి లు జీవన్ రెడ్డి బర్త్ డే కేక్ కట్ చేసి అందరికి తినిపించారు.
ఈసందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నo కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పెండింగులో ఉన్న జగిత్యాల జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ఇతర సంక్షేమ పథకాలను అందించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లతో మాట్లాడి పరిష్కరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కోరారు.
అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో
జగిత్యాల సీనియర్ పాత్రికేయులు సాక్షి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కందుకూరి శశిధర్, వార్త బ్యూరో ఎల్లాల రాజేందర్ రెడ్డి, పన్నాల లక్ష్మారెడ్డి, సిరిసిల్ల వేణుగోపాల్,
రాగుల గోపాలాచారి,
బెజ్జంకి సంపూర్ణ చారి, రాజ్ కుమార్, రంజిత్,బాస మహేష్,కాంగ్రెస్
నాయకులు గాజుల నగేష్, పులి రామ్,
ఎన్నo మధుకర్ రెడ్డి, వంగల అమర్, గంగాదర్, దయ్యాల శంకర్, మారు గంగారెడ్డి, పన్నీర్ సతీష్, మ్యానపురి మహేష్,దరి, ముష్కరి బాలాజీ,
తదితరులు పాల్గొన్నారు.