Saturday, February 14, 2026

ఘనంగా డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్  వర్ధంతి వేడుకలు

- Advertisement -

ఘనంగా డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్  వర్ధంతి వేడుకలు

Grand death anniversary celebrations of Dr. Babasaheb Ambedkar

 రామగుండం :

డాక్టర్ బాబాసాహేబ్  అంబేద్కర్ 68 వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని రామగుండం ఏరియా.1 యస్.సి మరియు  యస్.టి ఉద్యోగుల వేల్ఫేర్ అసోషియోషన్ ఆద్వర్యంలో  డా. బి.ఆర్. అంబేద్కర్  వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగినది. ఇట్టి వేడుకలకు ఆర్.జి.1 డిజియం  పర్సనల్  డి. కిరణ్ బాబు  ముఖ్య అతిగా హాజరయి కొత్త కురగాయాల్ మార్కెట్ వద్ద ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి  పూల మాలలు వేసి నివాళులు అర్పించడము జరిగినది.
అనంతరం డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి  డిజియం ఫారెస్ట్ బానొత్ కర్ణ  యస్.సి, యస్.టి సంఘం సభ్యులు, పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది.
ఈ సందర్భముగా ముఖ్య అథితి డి. కిరణ్ బాబు  మాట్లడుతూ డా.బి.ఆర్ అంబేద్కర్ తన జీవిత ఆశయ సాధనలో చిన్నప్పటి నుండి ఎంతో వివక్షకు గురయి అంగ్లేయుల పాలనలో ఉన్నత విద్యను అభ్యసించి మన బావి తరాల భవిష్యత్తు కొరకు తిరుగులేని భారత రాజ్యంగాన్ని రచించి ప్రపంచ దేశాలకే ఆదర్శప్రాయంగా నిలిచారని తెలిపారు. భారత దేశంలోని వివిధ మతాలు, వర్గాలు, కుల వ్యవస్థలు చిన్న పెద్ద అనే తార తమ్యం లేకుండా దేశ ప్రజలందరు సమఖ్యంగా, ఐఖ్యతతో ఉండి దేశానికి, రాష్ట్రానికి మరియు సింగరేణి సంస్థకు అదర్శంగా ఉండాలన్నారు. ఎన్నో సంవత్సరములుగా అణగారిన వర్గాలకు అశజ్యోతీగా రాజ్యంగాన్ని వ్రాసి దానిని అమలు చేసిన గొప్ప మహానీయుడని ప్రపంచ దేశాలు వారిని స్ఫూర్తిగా తీసుకొనుచున్నవని తెలిపారు.
ఇట్టి కార్యక్రమములో  యస్.సి అండ్ యస్.టి సంఘాల నాయకులు జనగామ నర్సయ్య,  గంగారపు లింగ మూర్తి, ఈర్ల రేజేష్, యాట ఓదెలు, గడ్డం శంకర్, రమేష్, రాజేందర్, రాజేష్ తదితరులు  పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్