చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయంలో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Grand Independence Day celebrations at Tehsildar’s office
తిరుపతి
స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు.
చంద్రగిరి తహసిల్దారు కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు దేశభక్తి ఉట్టిపడేలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారిని స్మరించుకున్నారు. ఆ తర్వాత జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని అన్నారు.ప్రజా సమస్యల పరిష్కారం కొరకు, నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాను అని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అధికారులందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ప్రతి పనికి ఎమ్మెల్యే అనుమతి, సిఫార్సు లు అవసరం లేదు అని అధికారులు చట్టానికి, న్యాయానికి లోబడి ప్రతి సమస్యను పరిష్కరించాలి అని స్పష్టం చేశారు.రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధిలో ముందుండాలి అని పార్టీలకు అతీతంగా పాలన సాగాలని అన్నారు.రాచరికం పాలన పోవాలి ప్రజా పాలన కొనసాగాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి ముఖ్య నాయకులు చంద్రగిరి నియోజకవర్గ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




