ఘనంగా వంగవీటి మోహన్ రంగావిగ్రహా ఆవిష్కరణ
పెంటపాడు
Grand opening of Vangaveeti Mohan Ranga Vigraha
బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యం గా మన నాయకుడు వంగవీటి మోహనరంగా పోరాటం మనకు స్ఫూర్తి అని పనస పూర్ణచంద్రరావు తెలిపారు,పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు గ్రామం లో వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులు గా కాపు నాయుకులు పనస పూర్ణచంద్రరావు(తలపాలెం బుజ్జి) పాల్గొన్నారు.కాపులు అంటే అల్లరి మూక అని ముద్ర పడింది దాని రూపుమాపడానికి రక్త దానం,పేద ప్రజలకు సహాయ కార్యక్రమలు చేసి ప్రజా సేవకులు గా మనం ముద్ర వేసుకోవాలి పేర్కొంటున్నారు.,మనం కలసి గట్టుగా ఉండాలి బలహీన వర్గాలకు తోడుగా ఉండాలి అని పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు.సర్పంచ్ పెన్నాడా సూర్యనారాయణ, మాజీ సొసైటీ చైర్మన్ వెంకటరమణ,జనసేన అధ్యక్షులు మునగాల శివ, మునగాల బాబ్జి ,అడపా నారాయణ మూర్తి,మేక శ్రీనివాసు, ధనరాజు, పెన్నాడా రాఘవులు, దేవా సత్యనారాయణ, దేవా వెంకన్న పెన్నాడా శ్రీనివాసు మరియు కమిటీ సభ్యులు పాల్గున్నారు.