- Advertisement -
ఘనంగా వెంకటస్వామి జయంతి వేడుకలు
Grand Venkataswamy Jayanti celebrations
కోరుట్ల సెప్టెంబర్ 5
బలహీనవర్గాల ఆశాజ్యోతి, ఇల్లు లేని నిరుపేదలకు గూడును చూపించిన దళిత నేత గడ్డం వెంకటస్వామి 95వ జయంతి సందర్భంగా శనివారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తాలో వెంకటస్వామి చిత్రపటానికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వెంకట స్వామి గూడు లేని నిరుపేదల కోసం వారి గూడు కోసం పోరాడి, గుడిసెలను వేయించి ఆయన ఇంటి పేరే గుడిసెల వెంకటస్వామిగా మార్చుకున్నారన్నారు. కార్మిక, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం, జీవితాంతం పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి వెంకటస్వామి అన్నారు. ఆయన ఐదుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ కి ఎంతో పేరు తెచ్చారు.ఆయన ఏ పదవి చేపట్టిన ఏ పదవికైనా వన్నె తెచ్చారని అన్నారు. దేశంలోనే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. దళితుల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనత వెంకట స్వామికి దక్కుతుందన్నారు. ఆయనను ప్రతి ఒక్కరూ కాకా పిలుచుకునే వారని, ఆయనను ఎంతగానో గౌరవించే వారిని అన్నారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పలువురికి పండ్ల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బలిజ పద్మా , మోర్తాడ్ లక్ష్మీనారాయణ, గంధం గంగాధర్ , బద్ది సుజాత మురళి ,సంఘ రాష్ట్ర నాయకులు , ఉయ్యాల నరసయ్య, బలిజ రాజారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్, నాయకులు పసుల కృష్ణ ప్రసాద్ , పసుల రాంప్రసాద్, సిరికొండ (పోతారం) రాములు, సామల వేణుగోపాల్, పసుల చిన్నయ్య, గురు మంతుల నారాయణ, మారంపల్లి నరసయ్య, బలిజ శివ ప్రసాద్, పలువురు అంబేద్కర్ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -