ఆశా దీపిక కు ఘన స్వాగతం

- Advertisement -

ఆశా దీపిక కు ఘన స్వాగతం

Grand Welcome for Asha Deepika

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మిస్సెస్ ఇండియా అవార్డు గెలుపొంది ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనడానికి ఎంపికైన ఆశా దీపిక కు ఘన స్వాగతం లభించింది. బెంగళూరులోని పెదర్ లైట్ హోటల్లో భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన 30 మంది మోడల్స్ మధ్య మూడు రోజులపాటు జరిగిన పోటీలో మిస్సెస్ ఇండియా కాస్ మూస్క్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ పోటీలు జరిగినట్లు చెప్పారు. యూనిటీ ఆర్గనైజేషన్ ద్వారా మిస్సెస్ వరల్డ్ పోటీలకు వచ్చే సెప్టెంబర్ లో వెళ్లబోతున్నట్టు ఆమె తెలిపింది. యూనిటీ వరల్డ్ అండ్ ఆర్గనైజేషన్ లో నేను ఒక్కదాన్నే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాను అని తెలిపారు. ఫైనల్ గా నేషనల్ లెవెల్ లో ఇండియాను కూడా రిప్రెజెంట్ చేస్తున్నట్టు తెలిపారు. తాను ఏఐలో వర్క్ చేస్తున్నట్టు తెలిపారు. నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి అన్ని ప్రభుత్వాలలో పనిచేయాలన్నది తన కోరిక అని చెప్పారు. ప్రపంచంలో భారతదేశానికి ఉత్తమమైన ప్రాధాన్యత లభించాలని విధంగా తాను పనిచేయాలనుకున్నట్టు వెల్లడించారు. టెక్నాలజీలో తను మామూలు పర్సన్ అని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ లో ఒక ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకున్నాను అని తెలిపారు. తాను పుట్టింది తెనాలి పట్టణంలోని కానీ పెరిగింది మొత్తం హైదరాబాదులోనే అని చెప్తూ తాను పక్క హైదరాబాదునని ప్రస్తుతం యుఎస్ లో ఉంటూ తన కెరియర్ అంతా యూఎస్ లోనే గడిచిందని మోడలింగ్ చేయడానికి భారతదేశానికి వచ్చినట్టు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular