Wednesday, January 21, 2026

గ్రేటర్ లో  వన మహోత్సవం  సూపర్ సక్సెస్

- Advertisement -

గ్రేటర్ లో  వన మహోత్సవం  సూపర్ సక్సెస్

– ప్రభుత్వ లక్ష్యం 25 లక్షలు… నాటిన మొక్కలు 25 లక్షల 31 వేలు

– ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో 101 శాతం పూర్తి

హైదరాబాద్‌, సెప్టెంబర్ 19, 2025:
Greater Lo Vana Mahotsavam a super success

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వన మహోత్సవం  సూపర్ సక్సెస్ అయ్యింది.

గ్రేటర్ వ్యాప్తంగా 25 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం జీహెచ్ఎంసీకి లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రభుత్వం నిర్దేశించిన 25 లక్షలకు అదనంగా మరో 52,599 మొక్కలు నాటాలని మొత్తం ఈ సంవత్సరం 25 లక్షల 52 వేల 599 మొక్కలు నాటాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటికే జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 25 లక్షల 31 వేల 848 మొక్కలను నాటింది.  ఈ ఏటా వర్షాకాల ప్రారంభంలో ఆశించినంత మేర వర్షాలు కురవకపోవడంతో కాస్త ఆలస్యంగా ప్రారంభమైన వన మహోత్సవం, ఆ తర్వాత గ్రేటర్ వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురవడంతో అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉధృతం చేశారు. చైతన్య కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మొక్కల ప్రాధాన్యతను వివరించారు

ప్రజా ప్రతినిధులు, ప్రజల్ని భాగస్వామ్యం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ఎప్పటికప్పుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని సమీక్షిస్తూ వన మహోత్సవ లక్ష్యం వేగంగా పూర్తయ్యేలా క్షేత్ర అధికారుల సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.
ఫలితంగా వేగంగా లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 25 లక్షలు మొక్కలు నాటే  లక్ష్యంలో ప్రస్తుతం 101 శాతం లక్ష్యాన్నీ సాధించింది.

జీహెచ్ఎంసీ మొత్తం లక్ష్యం 25 లక్షల 52 వేల 599 ( ప్రభుత్వం లక్ష్యం 25 లక్షలు plus జీహెచ్ఎంసీ అదనపు లక్ష్యం  52,599) లలో 25 లక్షల 31 వేల మొక్కలు నాటి 99 శాతం లక్ష్యం పూర్తి చేసింది.

నగరంలో పచ్చదనం పెంపుతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు వాయు  నాణ్యత  పెరుగుతుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్