భవిష్యత్ గ్రీన్ హైడ్రోజన్ దే
హర్‌దీప్ పురి, కేంద్రమంత్రి
న్యూఢిల్లీ, ఆగస్టు 26: కేంద్రమంత్రి హర్‌దీప్ పురి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో Green Hydrogen వినియోగం పెరుగుతుందని, ఇదే Fuel of Future అని వెల్లడించారు. ఢిల్లీలోని ఓ సదస్సులో పాల్గొన్న ఆయన ఇంధన వినియోగాన్ని ప్రస్తావించారు. ఇప్పటి వరకూ శిలాజ ఇంధనాలు వాడామని, ఇకపై క్రమంగా ప్రజలందరూ ఈ వాడకాన్ని తగ్గించేస్తారని అన్నారు. కట్టెల పొయ్యి, బొగ్గు కుంపట్ల నుంచి ప్రజలు ఎలాగైతే మెల్లగా గ్యాస్ సిలిండర్ల వినియోగంవైపు మళ్లారో…అదే విధంగా భవిష్యత్‌లో పెట్రోల్, డీజిల్‌ని పక్కన పెట్టి గ్రీన్ హైడ్రోజన్‌ని ఎంచుకుంటారని వివరించారు హర్‌దీప్ పురి. “ఇప్పటి నుంచి మరో 20 ఏళ్లలో ప్రజలు క్రమంగా శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించేస్తారు. పెట్రోల్, డీజిల్‌కి బదులుగా గ్రీన్ హైడ్రోజన్ అందుబాటులోకి వస్తుంది. దేశీయ డిమాండ్‌కి తగ్గట్టుగా ఇది సరఫరా అవుతుంది”2021లోనే ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా గ్రీన్ హైడ్రోజన్ గురించి ప్రస్తావించారు. అప్పటి నుంచి దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ…తేజస్వీ యాదవ్‌కి గ్రీన్ హైడ్రోజన్ కార్ గిఫ్ట్‌గా ఇచ్చారు. “2021లో ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా గ్రీన్ హైడ్రోజన్ గురించి ప్రస్తావించారు. చాలా మంది దీనిపై ప్రశ్నలు సంధించారు. ఎర్రకోటలో చెప్పారంటే ప్రధాని కచ్చితంగా చేసి తీరతారు. గతంలో గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌లు లేనప్పుడు మహిళలు చెక్క, బొగ్గుతో పొయ్యి పెట్టుకుని చాలా ఇబ్బందులు పడ్డారు. ఉజ్వల స్కీమ్ ద్వారా ఆ కష్టాల్ని తొలగించాం. సంవత్సరానికి 9 సిలిండర్‌లు ఇచ్చేలా ప్లాన్ చేశాం. సమస్యని పరిష్కరించాం.”ఇప్పటికే చాలా మంది విద్యుత్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారని చెప్పారు హర్‌దీప్ పురి. ఇదే విధంగా శిలాజ ఇంధనాలపై ఆధార పడడం తగ్గిపోయిం…గ్రీన్ హైడ్రోజన్‌తోనే వాహనాలు నడిపే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్రోల్‌ని బయోఫ్యూయెల్స్‌తో కలిపితే ఫాజిల్ ఫ్యూయెల్స్‌పై ఆధారపడడం తగ్గుతుందని వివరించారు. ఇప్పటి వరకూ ఉన్న అధ్యయనాల ఆధారంగా చూస్తే పెట్రోల్‌ని బయో ఫ్యూయెల్‌ని 20% మేర కలిపితే వెహికిల్ పార్ట్స్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేం ప్రయోగాలు చేసే ఈ వివరాలు చెబుతున్నాం. దీన్నే E20 Fuelగా పిలుస్తున్నాం. ప్రస్తుతానికి దేశంలో 2 వేల పెట్రోల్ బంక్‌లలో ఈ ఇంధనం అందుబాటులో ఉంది. ఈ E20 ఇంధనానికి తగ్గట్టుగా ప్రస్తుతం టెక్నాలజీని అప్‌డేట్ చేస్తున్నాం. కాకపోతే…ఇప్పుడు 20%కి మించి మిక్స్ చేయలేం. త్వరలోనే కార్‌లు E85 Fuelతో నడుస్తాయి. అంటే…85% ఇథనాల్‌నే ఇంధనంగా వాడతాం. సింపుల్‌గా చెప్పాలంటే…క్రమంగా శిలాజ ఇంధనాల ట్రెండ్‌కి స్వస్తి పలుకుతాం. ఫ్యూచర్ అంతా గ్రీన్ హైడ్రోజన్‌దే. ఈ రంగంలో పెట్టుబడులు పెరిగితే త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటామన్న నమ్మకముంది. “