బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల,
Grievance Day for speedy justice to victims
బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. భూ తగాదాలు,ఆస్థి తగాదాల విషయంలో చట్ట ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని అధికారులకు సూచించారు . గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తున్నామన్నారు.