గృహజ్యోతి పథకం గొడవ… ఓ తల్లి ప్రాణం తీసింది..

- Advertisement -

*గృహజ్యోతి పథకం గొడవ… ఓ తల్లి ప్రాణం తీసింది..*

Grihajyoti scheme quarrel… A mother took her life..

జనగామ జిల్లా, స్టేషన్ ఘన్ పూర్, నమలిగొండలో ఘటన

 

నమిలిగొండకి చెందిన లచ్చమ్మ(66) భర్త చనిపోవడంతో కూలీ పని చేసుకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది.

 

ఆమెకు ఇద్దరు కుమారులు కాగా, కుటుంబ రేషన్ కార్డులో ఆమెతో పాటు చిన్నకొడుకు సత్తయ్య పేరు ఉంది.

 

కాజీపేటలో ఉంటున్న సత్తయ్య, శుక్రవారం భార్య మమతతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు.

 

అమ్మ వద్ద ఉంటానని చెప్పి భార్యను సత్తయ్య కాజీపేటకు పంపించేసాడు..

 

కొడుకు వచ్చిన సంతోషంతో చికెన్ తీసుకొచ్చి వొండిన లచ్చమ్మ రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు కలిసి భోజనం చేశారు.

 

కొద్దిసేపటికి కొడుకు సత్తయ్యను గృహజ్యోతి పథకం నాకొచ్చేలా చెయ్…కూలీ పని చేసిన డబ్బులు మిగలడం లేదు అని సత్తయ్యను లచ్చమ్మ అడిగింది.

 

దీంతో ఆవేశానికి లోనైన సత్తయ్య పక్కనున్న రాడ్డుతో పలుమార్లు తల్లి తలపై కొట్టడంతో లచ్చమ్మ తల పగిలి చనిపోయింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular