- Advertisement -
దేశంలో మరోసారి జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి.
ఫిబ్రవరి నెలకు గాను రూ.1.68 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
గతేడాది ఈ నెలతో పోలిస్తే ఇది 12.5 శాతం అధికం. ఆ ఏడాది రూ.1.51 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి
దేశీయ లావాదేవీలపై జీఎస్టీ వసూళ్లు 13.9 శాతం, దిగుమతైన వస్తువులపై వసూలయ్యే జీఎస్టీ 8.5 శాతం వృద్ధి కారణంగా జీఎస్టీ వసూళ్ల వృద్ధికి దోహదం చేసినట్లు ఆ శాఖ వెల్లడించింది.
- Advertisement -