
సీఎం సభకు ముస్తాబైన ప్రకాశం స్టేడియం
వేలాదిగా తరలిరానున్న ప్రజలు, కార్యకర్తలు
80 వేల మందిని తరలించేందుకు ప్రణాళికలు
వనమా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పార్టీ శ్రేణులు
రెండు లక్షల మజ్జిగ,రెండు లక్షల మంచినీటి ప్యాకెట్లు సిద్ధం
(భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో వాయిస్ టుడే4)
స్టేడియంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 150 మంది వాలంటీర్లు
స్టేడియం లోపల,బయట 8 భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు ప్రకాశం స్టేడియం గ్రౌండ్ ముస్తాబయింది. సీఎం సభ విజయవంతానికి పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. కెసిఆర్ ప్రసంగించే సభ స్థలితోపాటు సభ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. స్టేడియం తో పాటు కొత్తగూడెం నియోజకవర్గం మొత్తం కెసిఆర్ రాకను పురస్కరించుకొని గులాబీ మయంగా మార్చారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కెసిఆర్ కు స్వాగతం పలికే భారీ కటౌట్లతోపాటు ఫ్లెక్సీలు, గులాబీ జెండాలు, తోరణాలతో నిండిపోయింది. నియోజకవర్గ మొత్తం అడుగడుగునా గులాబీ మాయమైంది. సభకు సుమారు 80,000 మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలోని గ్రామాలతో పాటు మున్సిపాలిటీలలోని వార్డులలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి సభా స్థలికి తరలించేందుకు సర్వసన్నద్ధమయ్యారు. ఈ భారీ బహిరంగ సభకు డప్పు వాయిద్యాలు, నృత్యాలు, ద్విచక్ర వాహనలు, ఆటో,కార్ల ర్యాలీల ద్వారా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు ఆయా గ్రామాల నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. సభ విజయవంతానికి ప్రతి ఒక్కరూ శక్తుల కృషి చేస్తున్నారు. కొత్తగూడెం బి ఆర్ ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు పార్టీ శ్రేణులు. వేలాదిగా తరలి రానున్న ప్రజలు కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. సభ పూర్తయ్యాక ప్రజలను ఇండ్లకు చేర్చేలా నాలికలు రూపొందించారు.సభ ప్రాంగణంలో ప్రజలు కార్యకర్తలకు ఇటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు. స్టేడియంలో 150 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి సభకు వచ్చిన ప్రజలు కార్యకర్తలకు ఇబ్బందులు కలక్కుండా చర్యలు చేపట్టారు. సభకు వచ్చిన ప్రజలు కార్యకర్తల కోసం రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లు, రెండు లక్షల మంచినీటి ప్యాకెట్లను సిద్ధం చేసి ఉంచారు. వాలంటీర్ల ద్వారా మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించేలా స్టేడియం లోపల బయట 8 భారీ ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేయించారు.


