Friday, December 27, 2024

కలెక్షన్లలో గులాబే టాప్ 10 కోట్లు చొప్పున ఇచ్చిన నేతలు

- Advertisement -

కలెక్షన్లలో గులాబే టాప్
10 కోట్లు చొప్పున ఇచ్చిన నేతలు
హైదరాబాద్, జనవరి 4,
రాజకీయ పార్టీలకు ప్రతీ ఏటా వివిధ రకాలుగా సమకూరే ఆదాయానికి సంబంధించి ప్రాంతీయ పార్టీల విభాగంలో బీఆర్ఎస్ మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవలే అధికారం కోల్పోయిన ఆ పార్టీకి 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.683 కోట్ల విరాళాలు లభించాయి. వీటిలో రూ.529 కోట్లు ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా లభించాయి. అంతకముందు ఏడాది ఆ పార్టీకి రూ.193 కోట్ల విరాళాలు రాగా… వాటిలో ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా కేవలం రూ.153 కోట్లు మాత్రమే లభించాయి. వివిధ పార్టీల ఆడిట్ రిపోర్టులను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీకి గత ఏడాదితో పోల్చితే భారీగా విరాళాలు పెరిగాయి. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా ఎవరెవరు ఎంతిచ్చారంటే?బీఆర్ఎస్ కు ఆ పార్టీ నేతలు, వారి సన్నిహితులే ఎక్కువగా విరాళాలు ఇచ్చారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్ది రాజు రవిచంద్ర, హాన్స్ పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, రాజపుష్ప ప్రాపర్టీస్……వీరంతా తలో రూ.10 కోట్ల విరాళాలను బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. వ్యక్తుల నుంచి వచ్చిన రూ.64 కోట్ల విరాళాలలో ఈ నలుగురి వాటానే రూ.40 కోట్లుగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే వద్ది రాజు రవిచంద్రకి గాయత్రి గ్రానైట్స్ లో వాటా, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆయనకు భూములు ఉన్నాయి. వద్ది రాజు, గంగుల ఒకే పార్టీకి చెందిన నేతలే కాకుండా బంధువులు కూడా. ఇక హన్సా పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు చెందినది. ఇక రాజా పుష్ప ప్రాపర్టీస్ అనే కంపెనీ ఆ పార్టీ ఎమ్మెల్సీ పి. వెంకట్రామరెడ్డి బంధువులకు చెందినది. దీంతో బీఆర్ఎస్ మొత్తం విరాళాలలో ఈ నలుగురి వాటానే ఎక్కువగా ఉంది.మాజీ మంత్రి మల్లారెడ్డి రూ.2.75 కోట్లు, మల్లారెడ్డి సతీమణి పేరిట రూ.2.25 కోట్లు విరాళంగా ఇచ్చారు. రోషణి మినరల్స్ నుంచి రూ.5 కోట్లు, వేములవాడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చెల్మెడ నరసింహారావు బంధువులకు చెందిన చెల్మెడ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.2 కోట్లు, విమలా ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.2 కోట్లు ఇచ్చారు. ఎలెక్టోరల్ ట్రస్ట్ ఫండ్స్ కింద ఫ్రుడెంట్ ఎలెక్టోరల్ ట్రస్ట్ నుంచి దఫాల వారీగా రూ.75 కోట్లు, రూ.10 కోట్లు, రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.90 కోట్లు విరాళంగా అందాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్