గుల్జార్ హౌస్ ఘటన కలచివేసింది ఎంపి ఈటల రాజేందర్

- Advertisement -

గుల్జార్ హౌస్ ఘటన కలచివేసింది
ఎంపి ఈటల రాజేందర్
హైదరాబాద్

Gulzar House incident leaves MP Etala Rajender in shock

ఎస్ఎస్సి కన్వెన్షన్ హాల్లో  పాతబస్తీ గుల్జర్ హౌస్ అగ్నిప్రమాదంలో మరణించిన మోదీ అగర్వాల్ కుటుంబ సంతాప సభకు ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరై నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… చార్మినార్, గుల్జర్ హౌస్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి 17 మంది చనిపోవడం యావత్ సమాజాన్ని కలిచివేసింది.  అగ్నిప్రమాదం ఏ సమయంలో జరిగింది, ఎన్ని గంటలకు ఫోన్ వెళ్ళింది, ఏ టైం కు రెస్క్యూ సిబ్బంది వచ్చారు అనే దానిపై ముఖ్యమంత్రి గారిని  రాజకీయాలకు, వివక్షకు ఆస్కారం లేకుండా సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను.  చార్మినార్, బేగంబజార్, ఓల్డ్ సిటీలో నిర్మాణాలు ఎప్పుడో కట్టినవి కాబట్టి ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఒక సమగ్రమైన ప్రణాళిక చేయాలని కోరుతున్నాను.  ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితుల్ని ఎస్సెట్ చేసి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాను. ఫైర్ డిపార్ట్మెంట్, వైద్య సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నాను. ఒకటే కుటుంబంలో 17 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.  ఇలాంటి సంఘటనలు, దుఃఖాలు మరొకరికి రాకూడదు అంటే ప్రభుత్వం సమగ్రమైన ప్రణాళిక రూపొందించాలని కోరుతున్నానని అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular