కలియుగ వైతాళికుడు గురజాడ
Gurjada is Vaithalika of Kaliyuga:యం వి సుబ్బారెడ్డి, జడ్పీ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు
డోన్
గురుజాడ అప్పారావు ఒక కలియుగ వైతాలీకుడు అనీ పాతపేట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి అన్నారు, స్థానిక డోన్ పాతపేట జడ్పీ ఉన్నత పాఠశాల లో శనివారంఉదయం ప్రధానోపాధ్యాయులు
వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా, గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు,ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు దేవేంద్రప్ప మాట్లాడుతూ తెలుగు రాష్ట్రం లో సంస్కృతం నందు ఉన్న సాహిత్యంను వ్యవహారిక భాషలోకి మార్చి అందరికీ అర్థమయ్యే రీతిలో, అచ్చ తెలుగులోకి అనువదించారు, అంతే కాకుండా ఆరోజుల్లో మూఢాచారాలను పారద్రోలి, జ్ఞానోదయం కలిగించే కార్యక్రమాలు చేపట్టారు, స్త్రీ లను తొక్కిపెట్టేనాటి శిథిల సమాజం పై కన్యాశుల్కం నాటకంతో అగ్ని వర్షం కురిపించిన కాలం యోధులు గురజాడ. గురజాడ అప్పారావు గారు రచించిన దేశభక్తి గేయం దేశంను ప్రేమించుమన్నా, మంచి యన్నది పెంచుమన్నా ప్రసిద్ధి చెందింది,పుత్తడి బొమ్మా పూర్ణమ్మ నాటికతో జనంలో చైతన్యం కలిగించారన్నారు, ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు వెంకట రమణ, వెంకట లక్ష్మీ, రఘునాథ్, ఎస్తేరమ్మ, లక్ష్మీకాంతరెడ్డి, సుబ్బారాయుడు, మధుసూదన్ రెడ్డి, విజయకుమార్, సుభాన్, శ్రీనివాసులు, యన్ యస్ బాబు, ఆదినారాయణ, భాను ప్రకాష్ రెడ్డి, సురేష్, రమేష్, ముని రాజు, ప్రసాద్ రావు,మహేష్, అల్లిపీరా, తదితరులు పాల్గొన్నారు.




