- Advertisement -
రాష్ట్ర నాయకునిగా గుర్రం అజయ్ ఎన్నిక
Gurram Ajay is elected as the state leader
నర్సంపేట:
ఆరుణోదయ సంస్కృతిక సమైఖ్య రాష్ట్ర నాయకునిగా ఎన్నిక జరిగిందని గుర్రం అజయ్ తెలిపాడు.ఈ సందర్బంగా అజయ్ మాట్లాడుతూ, సూర్యాపేటలో రెండు అరుణోదయ సంస్కృతిక సమాఖ్య మహాసభ ఏర్పాటు చేశారని, మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారని అన్నాడు.కళ కళ కోసం కాదని కళ ప్రజల కోసం అన్నాడు.నిత్యం ప్రజలు దోపిడీకి గురి అవుతున్న వారిని చైతన్య పరచడంలో అరుణోదయ సంస్కృతిక సమాఖ్యా ఎంతో ఉపయోగపడుతుందని, పాటల రూపంలో నాటికల రూపంలో గ్రామాల్లోకీ వెళ్లి ప్రదర్శనలు చేయడం వల్ల ప్రజలు చైతన్య వంతులై సమాజానికి ఉపయోగపడుతారని వివరించాడు.పంట పొలాలల్లో అమ్మాలక్కలు పాటలు పాడుకుంటూ పని కష్టంను మరిచిపోయేవారని,నేడు సినిమా రంగంలోని పాటలు ప్రైవేట్ పాటలు అంటూ, ప్రజలని అర్ధం లేని పాటలు పాడుతూ మన సంస్కృతికీ దూరం చేస్తున్నారని అన్నాడు. కానూరి వెంకటేశ్వర్లు, రామారావు తమ జీవిత కాలమంతా కలకోసమే దారాపోసి ప్రజల్ని చైతణ్యం చేసారన్నాడు.ఇప్పుడు ఉన్నటువంటి కళాకారులు పేరుకోసం,డబ్బు కోసం కళని అమ్ముకుంటున్నారని తెలిపాడు.ఎంతో మంది అరుణోదయ సంస్కృతిక సమైక్య కళ రంగంలో పని చేసిన కలాకారులు అమరులను స్మరించుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకువెల్లె వారన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి విష సంస్కృతులకు వ్యతిరేకంగా పోరాడుతనని అన్నాడు.
- Advertisement -



