- Advertisement -
కస్తూరిబా గురుకుల పాఠశాల విద్యార్థుల పొలం బాట
వ్యవసాయంలో విద్యార్థినిలకు మెళకువలు .
Gurukula school students farm trail
రుద్రవరం,
రుద్రవరం కస్తూరిబా గురుకుల పాఠశాల విద్యార్థు లు పొలం బాట పట్టారు. శనివారం అగ్రికల్చర్ ఫీల్డ్ విఙిట్ లో భాగంగా ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో విద్యార్థినీలు పొలానికి వెళ్లి నాటు వేసినారు. ఈ సందర్భంగాప్రిన్సిపాల్ మాట్లాడుతూ పుస్తకాలు కొన్ని నేర్పుతాయి. ఇప్పుడు క్షేత్రస్థాయి అధ్యయనo జీవితాన్ని నేర్పుతుంది అన్నారు.తల్లి తండ్రుల విలువ కూడా తెలుస్తుంది అని చెప్పారు.
ఆహార క్షేత్రంలో మన రైతుల పడే శ్రమ, కష్టం ప్రత్యక్షంగా విద్యార్థినిలు చూశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు50 విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -




