ఎంపీ వద్దిరాజు తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు
Happy Dussehra to the people of Telangana: MP Vaddiraju
దసరా పండుగ (విజయదశమి)సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ వారందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో ముఖ్యమైన పండుగగా జరుపుకునే దసరా విశిష్టతను ప్రపంచానికి చాటి చెబుతూ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించిన విషయాన్ని తన సందేశంలో ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వాన జరిగిన మహోద్యమంలో బతుకమ్మ,దసరా పండుగలు కూడా ప్రజలకు మరింత స్ఫూర్తినిచ్చాయని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.విజయదశమి పర్వదినం సందర్భంగా తెలంగాణ వాసులు,దేశం నలుమూలల,పలు దేశాలలో నివసిస్తున్న, స్థిరపడిన తెలంగాణ బిడ్డలందరికి ఎంపీ రవిచంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
దుర్గామాత కరుణా కటాక్షాలతో తెలంగాణ బిడ్డలందరికి మంచి జరగాలని,సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఎంపీ వద్దిరాజు అభిలషించారు.



