Friday, November 22, 2024

సీఎం రేవంత్ సవాల్‌కు హరీష్ స్ట్రాంగ్ కౌంటర్

- Advertisement -

సీఎం రేవంత్ సవాల్‌కు హరీష్ స్ట్రాంగ్ కౌంటర్

Harish is a strong counter to CM Revanth’s challenge

హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌కు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  మీడియాతో మాట్లాడిన హరీష్.. సీఎంపై ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించట్లేదనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గానీ.. తెలంగాణ చరిత్రలో గానీ ఇంత దిగజారిన, దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరని కౌంటర్ ఇచ్చారు హరీష్. అబద్దం కూడా సిగ్గుపడి మూసిలో దూకి ఆత్మహత్య చేసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉంది. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడలేదు. నిస్సిగ్గుగా బీఆర్ఎస్ మీద.. నామీద అవాకులు చెవాకులు పేలారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్-9 నాటికి 40వేల కోట్ల రూపాయల రైతు రుణ మాఫీ ఏకకాలంలో చేస్తాన్నన్నది రేవంత్ రెడ్డే కదా, అనే విషయాన్ని హరీష్ గుర్తు చేశారు.
లెక్కలు తీసి మరీ..!
‘డిసెంబర్-9న రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపిండు. ఆగస్టు-15తేదీ వరకూ 31వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికలలో ఊదరగొట్టిండు. 9వేల కోట్లు కోత పెట్టిండు. అయినా ఎవరూ నమ్మడం లేదని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేసిండు. సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్దమే నా లక్షణం. మోసమే నా విధానం. మాట తప్పడమే నా నైజం అనే విధంగా నగ్నంగా తన నిజస్వరూపాన్ని ఈ రోజు బట్టబయలు చేసుకున్నడు. మేము మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ 35లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు 17వేల కోట్లు అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటరా..? రూ. 17,869 కోట్లు మాత్రమే అవుతాయా?. ఈ ఒక్క విషయంతోనే మీ రుణమాఫీ పచ్చి అబద్దం అని తేలిపోతున్నది. మీరు దగా చేశారనన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి?. ఏటిలో దుంకి ఎవరు చావాలి?’ అని రివర్స్ అటాక్ చేశారు హరీష్.

Harish is a strong counter to CM Revanth’s challenge

హరీష్ ఆందోళన ఇదీ
నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో బీఆర్ఎస్‌ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్దాలు నిజాలు అయిపోవు. రేవంత్ రెడ్డి నువ్వు రైతు ద్రోహానికి మాత్రమే కాదు. దైవ ద్రోహానికి పాల్పడ్డావు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి.. మాట తప్పి నువ్వు చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ నీకు ఆ సంస్కారం లేదు. నీలో ఉన్నది వికారమే తప్ప, సంస్కారం కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో, నువ్వు చేసిన పాప ఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందో అని నేను ఆందోళనకు గురవుతున్నాను. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు గాను, దైవ ద్రోహానికి గాను తెలంగాణ మీద ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నా. ఆయన ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పండో ఆ దేవుళ్లందరి దగ్గరికి త్వరలో నేనే స్వయంగా పోతా. రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్తాను’ అని హరీష్ చెప్పుకొచ్చారు.
రేవంత్ ఛాలెంజ్ ఇదీ..
హరీష్ రావుకు మరోసారి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని.. చీము, నెత్తురు ఉంటే హరీష్‌ రాజీనామా ఖమ్మం జిల్లా వైరా బహిరంగసభలో ఛాలెంజ్ చేశారు. రాజీనామా చేస్తే సరే.. లేకుంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమండ్ చేశారు. అంతేకాదు.. ‘హరీష్‌రావు రాజీనామా చెయ్యి.. మళ్లీ ఎలా గెలుస్తావో చూస్తా. సిద్దిపేటలో హరీష్‌ను ఓడించే బాధ్యత నాది. బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయ్యింది. బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో కలుపుతాం’ అని ఈ సభావేదికగా రేవంత్ మరో ఛాలెంజ్ చేశారు. ఈ కామెంట్స్‌పై హరీష్ స్పందిస్తూ పైవిధంగా కౌంటర్ ఇచ్చారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్