Sunday, September 8, 2024

హరీష్ రావు మంచి నాయకుడే కానీ….

- Advertisement -

నిజంగా మీ అభివ్రుద్ధిని చూసే కాంగ్రెస్ లో చేరుతున్నారని భావిస్తే…..

ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరే దమ్ముందా?

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఆ రెండు పార్టీలాడుతున్న డ్రామా

బీజేపీ కార్యకర్తలను కేసీఆర్ సర్కార్ పెట్టిన హింసను అప్పుడే మర్చిపోతామా?

హరీష్ రావు మంచి నాయకుడే కానీ….

ఇదేమైనా బ్యాంకులోన్లా? ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలపై వన్ టైం సెటిల్ మెంట్ చేసుకోవడానికి?

తక్షణమే రీయంబర్స్ మెంట్ బకాయిలన్నీ చెల్లించాల్సిందే

తెలంగాణను అభివ్రుద్ధి చేయడమే తమ ముందున్న ఏకైక లక్ష్యం

కరీంనగర్ మీడియాతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

Harish Rao is a good leader but….

‘‘అభివ్రుద్ధిని చూసి కాంగ్రెస్ లో చేరుతున్నారని మాట్లాడుతున్న అధికార పార్టీ నేతలారా….. నిజంగా మీరు అభివ్రుద్ధి చేస్తున్నట్లు భావిస్తే మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరే దమ్ముందా?’’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ కొందరు ఎమ్మెల్యేలు తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికే అధికార పార్టీలో చేరుతున్నారని మండిపడ్డారు. పైకి మాత్రం సిగ్గు లేకుండా నియోజకవర్గ అభివ్రుద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వల్లించడం సిగ్గు చేటన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారమంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న కుట్రలో భాగమేనన్నారు. బీఆర్ఎస్ ను కాపాడుకోవడానికి కేసీఆర్, దొంగ హామీల నుండి ప్రజల ద్రుష్టి మళ్లించడానికి కాంగ్రెస్ నేతలు ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు. కేసీఆర్ హయాంలో తనతోపాటు బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడులు, పెట్టిన అక్రమ కేసులు, హింసను ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేశారు. ఈరోజు కరీంనగర్ లో కొందరు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బండి సంజయ్ బదులిచ్చారు.. ఏమన్నారంటే….

ఏ పార్టీని చూసి మీకు ఓటేశారు. మీరు ఏ పార్టీలోకి వెళుతున్నారు? ఏమైనా అంటే అభివ్రుద్ధి కోసం అధికార పార్టీలోకి వెళుతున్నారని రోటీన్ డైలాగ్ చెబుతున్నారు. ప్రజలు పిచ్చోళ్లు కాదు. కొందరేమో అధికారం ఎక్కడుంటే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నరు. వాళ్ల ఆస్తులను కాపాడుకోవడానికి? ఆ నియోజకవర్గాల్లో ఉన్న అధికార పార్టీ నేతలంతా పిచ్చోళ్లనుకుంటున్నరా?

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, హరీష్ చేరతారనే ప్రచారం పై అడిగిన ప్రశ్నకు…..

హరీష్ రావు మంచి పొలిటీషియన్. ఆయన బీజేపీలో చేరినా రాజీనామా చేసి రావాల్సిందే. అయినా బీజేపీలో బీర్ ఎస్ విలీనం ప్రచారం కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకాలివి. కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఆ పార్టీ లీడర్లను ఢిల్లీకి పంపి లీకులిస్తున్నరు. ఇచ్చిన హామీలపై ప్రజల ద్రుష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా ఇది. కేసీఆర్ హయాంలో నాతోసహా బీజేపీ కార్యకర్తలను ఏ విధంగా హింసించారో, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైళ్లో వేశారో ఎవరూ మర్చిపోలేరు. ఆ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటాం? అధికార పార్టీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా జనం నమ్మలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని 8 ఎంపీ స్థానాల్లో గెలిపించారు.

అభివ్రుద్ధిని చూసే కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారంపై….

కాంగ్రెస్ చేస్తున్న అభివ్రుద్ధిని నమ్మి ఎమ్మెల్యేలు చేరుతున్నారని చెబుతున్న నేతలకు సవాల్ చేస్తున్నా… నిజంగా మీరు అభివ్రుద్ధి చేస్తున్నట్లు భావిస్తే… ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరే దమ్ముందా? మా పార్టీలోకి వచ్చేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నా… రాజీనామా చేసిన తరువాతే పార్టీలోకి రావాలని చెబుతున్నామన్నారు. కచ్చితంగా బీజేపీలోకి రావాలంటే ఎమ్మెల్యే పదవులు రాజీనామా చేయాల్సిందేనని, ఇదే మా విధానమని పునరుద్ఘాటించారు. ఇప్పుడు మాకున్న ఏకైక లక్ష్యం.. తెలంగాణను అభివ్రుద్ధి చేయడమే.

కాంగ్రెస్ మోసాలపై….

కాంగ్రెస్ పార్టీ మోసాలను, దొంగ హామీలను ప్రజలను గుర్తించారు. అందుకే కాంగ్రెస్ ను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. అశోక్ నగర్ లో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనే ఇందుకు నిదర్శనం. యువతను రెచ్చగొడితే కాంగ్రెస్ కే నష్టమని గుర్తుంచుకుని వ్యవహరించాలి.

జంప్ జిలానీలపై…

Harish Rao is a good leader but….

కాంగ్రెస్ లో చేరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలారా… ఏ పార్టీని చూసి మీకు ఓటేశారు. మీరు ఏ పార్టీలోకి వెళుతున్నారు? ఏమైనా అంటే అభివ్రుద్ధి కోసం అధికార పార్టీలోకి వెళుతున్నారని రోటీన్ డైలాగ్ చెబుతున్నారు. ప్రజలు పిచ్చోళ్లు కాదు. కొందరేమో అధికారం ఎక్కడుంటే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నరు. వాళ్ల ఆస్తులను కాపాడుకోవడానికి? ఆ నియోజకవర్గాల్లో ఉన్న అధికార పార్టీ నేతలంతా పిచ్చోళ్లనుకుంటున్నరా?

ఫీజు రీయంబర్స్ మెంట్ ఓటీఎస్ పై….

ఫీజు రీయంబర్స్ మెంట్ పై వన్ టైం సెటిల్ మెంట్ ఏంది? ఇదేమైనా బ్యాంకు అనుకుంటున్నరా? లోన్లు తీసుకుని వడ్డీలు కట్టలేక వన్ టైం సెటిల్ మెంట్ చేసుకోవడానికి? ఏళ్ల తరబడి ఫీజు కట్టకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఫీజులివ్వకపోతే విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్