- Advertisement -
పుల్లూరు బండ జాతర లో పాల్గోన్న హరీష్ రావు
Harish Rao who participated in Pulluru Banda Jatara
సిద్దిపేట
పుల్లూరు గ్రామం లో జరుగుతున్న బండ జాతర చివరి రోజు ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గోన్నారు. ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జరిగిన సుదర్శన నరసింహ మహా పూర్ణహుతి కార్యక్రమం లో పాల్గొన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ పుల్లూరు బండ జాతర ఘనంగా జరిగింది. పుల్లూరు నరసింహ స్వామి గొప్ప మహిమన్వాహితం. పుల్లూరు బండ వేలాది భక్తుల దర్శనం తో పునీతం అయింది. పుల్లూరు నారసింహ క్షేత్రాన్ని సుమారు మూడున్నర 4కోట్ల తో పలు అభివృద్ధి చేశాం. పుల్లూరు బండ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం చాలా గొప్పదని ఇక్కడ నరసింహ స్వామి స్వయంగా వెలిశాడు. బండ పైకి వాహనాలు వెళ్లడం కోసం 35 లక్ష ల రూపాయల తో సీసీ రోడ్డు నిర్మింప జేశాం. 35 లక్షల టీటీడీ నిధులతో దేవాలయాన్ని పునరుద్దరింప జేశాం. 10 లక్షల రూపాయల తో దేవాలయం చుట్టూ షెడ్ నిర్మించాం. బండ పై మంచినీటి సమస్య ను శాశ్వతంగా దూరం చేయడం కోసం 80 లక్షల రూపాయల తో మిషన్ భగీరథ పథకం లో భాగంగా 1 లక్ష 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకును నిర్మాణం చేసాం. 50 లక్షల రూపాయల తో బండపై కళ్యాణ మండపం నిర్మించాం. 20 లక్షల రూపాయల తో బండ పై సుడా పార్క్ ను ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని ఇచ్చాం. మరో 8 లక్షల రూపాయల తో బండపై మినీ ట్యాంకు లు, పైప్ లైన్లు.. భక్తుల కోసం నల్లాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
బండపైకి సీసీరోడ్డు గుండా సుమారు 10 లక్షల రూపాయల తో విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేసాం. పుల్లూరు గ్రామ స్టేజీ వద్ద సుమారు 15 లక్షల రూపాయల తో దేవాలయ స్వాగత తోరణం కమాన్ ఏర్పాటు చేసాము. మరో 50 లక్షలు మంజూరు అయ్యాయని ఆ నిధులతో దేవాలయం కు వచ్చేభక్తుల సౌకర్యం కోసం ధర్మ శాలలు నిర్మింప చేస్తాము అదేవిదంగా మరో కొన్ని ధర్మ సత్రాలకు టీటీడీ కి ప్రతిపాదనలు పంపామని అన్నారు.
భవిష్యత్ లో మరిన్ని నిధులు కేటాయించి దేవాలయాన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేస్తాం. పుల్లూరు బండ క్షేత్రాన్ని పర్యాటకంగా ఆధ్యాత్మికంగా తీర్చి దిద్దుతామని అన్నారు,.
- Advertisement -