- Advertisement -
శనగ పంటలో పంటకోత ప్రయోగం
Harvest experiment in chickpea crop
మద్దికేర:
మద్దికేర మండల పరిధిలోని మద్దికేర పడమర రెవిన్యూ గ్రామం నందు గురువారం రోజున శనగ పంట నందు మండల వ్యవసాయ అధికారి రవి ఆధ్వర్యంలో పంట కోత ప్రయోగంను వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. ఇందులో 5మీ × 5మీ విస్తీరంలో మొదటి ప్రయోగంలో 2.24 కేజీలు, రెండవ ప్రయోగంలో 2.72 కేజీలు, మూడవ ప్రయోగంలో 2.52 కేజీలు, నాల్గవ ప్రయోగంలో 2.485 కేజీల దిగుబడి రావడం జరిగిందని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి భోజరాజు, వ్యవసాయ సహయకులు జాకీర్ హుస్సేన్,టాటా కంపెనీ ఇన్స్యూరెన్స్ ఏజెంట్ రవి,వి.ర్.ఏ లు సుంకన్న,ఆనంద్ మరియు గ్రామ రైతులు సుధాకర్, ఎల్లప్ప,వెంకటేశ్ తదితరులు పాల్గోన్నారు.
- Advertisement -