Sunday, September 8, 2024

హోమ్ లోన్  రిజెక్ట్ అయిందా …  నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయి గా..

- Advertisement -

ఫేక్ సర్టిఫికెట్లతో లోన్లు ఇప్పిస్తున్న ముఠా

Has the home loan been rejected... as there are fake certificates..
Has the home loan been rejected… as there are fake certificates..

హైదరాబాద్, సెప్టెంబర్ 19:  వెయ్యికి పైగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి హోం లోన్స్ ఇప్పిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఒక ముఠా గా ఏర్పడి ప్రభుత్వ అధికారుల సంతకాలతో , వారి హోదా పేరు పై రబ్బర్ స్టాంప్ లు తయారుచేసి మోసాలకు పాల్పడుతున్నారు. బాలనగర్ తో పాటు కూకట్పల్లి ఎస్ఓటి పోలీసులు ఈ కేసును చేదించారు. 18 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మీరు వద్ద నుండి 1180 నకిలీ సర్టిఫికెట్లతోపాటు 687 ఫేక్ రబ్బర్ స్టాంపులు, 10 లాప్టాప్ లతో కలిపి మొత్తం 10 కోట్ల విలువ చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హోమ్ లోన్ కు మొదట కస్టమర్ అప్లై చేసుకుంటాడు. వివిధ కారణాల చేత అతడి హోమ్ లోన్ రిజెక్ట్ అవుతుంది. దీంతో ఎలాగైనా హోమ్ లోన్ కావాలనుకునే కస్టమర్లు లోన్ కన్సల్టెంట్లను ఏజెంట్లను సంప్రదిస్తున్నారు. అలాంటి ఏజెంట్ లను పెట్టుకుని ఒక ముఠాగా ఏర్పడి గంట రంగారావు అనే వ్యక్తి లీడ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వివిధ కారణాలు చేత తిరస్కరించబడిన లోన్ ను కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి కస్టమర్లకు లోన్ వచ్చేలాగా చేస్తుంది ఈ ముఠా. వీటికోసం జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ రెవెన్యూ శాఖల అధికారుల రబ్బర్ స్టాంప్, నకిలీ సర్టిఫికెట్ల ఉపయోగించి నేరానికి పాల్పడుతున్నారు..మొత్తం మూడు విధానాల్లో ఈ ఫ్రాడ్ జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాను లీడ్ చేస్తున్న రంగారావు కింద ముగ్గురు ఏజెంట్లు ఉంటారు . ఒకరు రబ్బర్ స్టాంప్ క్రియేట్ చేస్తే, మరొకరు నకిలీ సర్టిఫికెట్ తయారు చేస్తారు. ఇంకొకరు లేఅవుట్ ప్లాన్ టెంపర్ చేస్తారు.. లోన్ తిరస్కరించబడిన కస్టమర్ మొదట ఏజెంట్ను సంప్రదిస్తాడు.. ఏజెంట్ తన లీడర్ రంగారావు దగ్గరికి కస్టమర్ ను తీసుకెళ్తాడు. తన కింద ఉన్న సభ్యుల ద్వారా కస్టమర్ కు కావలసిన డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి లోన్ ప్రాసెస్ ఈజీ అయ్యేలా చేస్తాడు రంగారావు. ఈ వ్యవహారంలో మొత్తం 18 మంది పాత్రను ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. కి ముఠా సభ్యులకు సహకరిస్తున్న ఏజెంట్లు, బ్యాంకర్లు, అడ్వకేట్ పానల్స్ ను పోలీసులు గుర్తిస్తున్నారు. ఈ ముఠా తయారు చేస్తున్న సర్టిఫికెట్ల ద్వారా ప్రముఖ బ్యాంకుల నుండి లోన్లు వస్తుండడం విశేషం. ప్రముఖ బ్యాంకులు ఎస్బిఐ, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ కర్ణాటక నుండి కస్టమర్లకు లోన్ లు వచ్చినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. అయితే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసి కూడా లోన్ అప్రూవ్ చేసిన బ్యాంకర్ల పాత్ర గురించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ 18 మంది కూకట్పల్లి ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు

Has the home loan been rejected... as there are fake certificates..
Has the home loan been rejected… as there are fake certificates..
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్