Sunday, September 8, 2024

సింధియా కు చుక్కలు

- Advertisement -

భోపాల్, అక్టోబరు 27, (వాయిస్ టుడే): మధ్యప్రదేశ్ లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింధియా రాజకుటుంబానికి పట్టున్న గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని 34సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 26 సీట్లు గెల్చుకుంది. అప్పుడు సింధియా కుటుంబ వారసుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సింధియాకు ఆ ప్రాంతంలో ఉన్న పట్టు అలాంటిది. కానీ ఆ తర్వాత ఆయన సీఎం పదవి ఇవ్వలేదనే కోపంతో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లిపోయారు. 22 మంది ఎమ్మెల్యేల్ని తనతో పాటు బీజేపీలోకి తీసుకెళ్లారు. అలా అని సీఎం అయ్యారా అంటే అదీ లేదు. కేవలం కేంద్ర మంత్రి మాత్రమే కాగలిగారు. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ లోపు ఒకప్పుడు తాను కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి తెచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. మరోసారి బీజేపీకి ఓటు వేసే విషయంలో రాష్ట్రంలో ప్రజలే కాదు తనకు పట్టున్న గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో జనం కూడా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ రాజకుమారుడికి ఈసారి తన సొంత గడ్డ గ్వాలియర్ ప్రాంతంలో అగ్నిపరీక్ష ఎదురవుతోంది.

ఈసారి మధ్యప్రదేశ్‌లో హోరాహోరీగా ఎన్నికలు సాగుతున్నాయి. ఇందులో సింధియా 12 మంది తన సన్నిహితులకు బీజేపీ టికెట్లు కూడా ఇప్పించుకున్నారు. కానీ ఆయన మాత్రం పోటీ చేయడం లేదు. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇక్కడి గుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సింధియా ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది. కానీ ఆయన అందుకు సిద్ధంగా లేరు. అలాగే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారనే ఆగ్రహం స్ధానికుల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి గ్వాలియర్ బెల్ట్ లో సింధియాకు ఓటర్లు గుణపాఠం చెప్పడం ఖాయమనే అంచనాలో ఉంది. గ్వాలియర్‌లో సింధియా పట్ల విధేయత మాత్రం కనిపిస్తోంది. కానీ స్ధానికంగా బీజేపీలో మాత్రం లుకలుకలు అలాగే ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా బీజేపీలో ఉన్న ఇక్కడి క్యాడర్, నేతలు సింధియా కాంగ్రెస్ నుంచి వచ్చి తమ పార్టీలో చేరాక తమను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో ఉంది. ఇది కూడా ఈసారి ఎన్నికల్లో సింధియా వర్గానికి మైనస్ కాబోతోంది. ఈ గొడవే బీజేపీకి సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సొంత ప్రాంతంలో సింధియా పట్టు కాపాడుకోకపోతే అతని భవిష్యత్తుకు ఇబ్బందులు తప్పేలా లేవు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్