Tuesday, April 1, 2025

హైదరాబాద్ లో హెచ్సీఎల్ కొత్త టెక్ సెంటర్

- Advertisement -

హైదరాబాద్ లో హెచ్సీఎల్ కొత్త టెక్ సెంటర్

HCL New Tech Center in Hyderabad

దావోస్
ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సీఎల్ టెక్ హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ను ప్రారంభించనుంది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ,  పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హెచ్సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ  సి.విజయకుమార్ తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి.
🔹 హెచ్సీఎల్  కొత్త సెంటర్లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యమిస్తుంది. అత్యాధునిక క్లౌడ్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్లను అందిస్తుంది.
🔹 హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ టెక్  కొత్త క్యాంపస్ ఏర్పాటవుతుంది. ఈ క్యాంపస్  ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్ కూడా అందుకుంది. ఈ కొత్త సెంటర్ ఏర్పాటుతో దాదాపు 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు, ఐటీలో ప్రతిభా వంతులైన నిపుణులతో ఇప్పటికే హెచ్సీఎల్  గ్లోబల్ నెట్ వర్క్ సెంటర్గా  హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కొత్త సెంటర్ మరింత అత్యాధునిక సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తుందని హెచ్సీఎల్  టెక్ సీఈవో విజయకుమార్ గారు అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో ఈ కొత్త సెంటర్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ని, ఐటీ శాఖ మంత్రి ని ఆహ్వానించారు.
🔹 రాష్ట్రంలో హెచ్సీఎల్ టెక్ సేవల విస్తరణ చేపట్టడాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. ప్రపంచంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని అన్నారు.
🔹 స్థానిక యువతకు ఉద్యోగాలతో పాటు హైదరాబాద్లోని టెక్నాలజీ, ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాలని, అందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారాన్ని అందిస్తామని హెచ్సీఎల్ టెక్ ప్రతినిధులకు తెలిపారు.
2007 నుంచే హెచ్సీఎల్ టెక్ హైదరాబాద్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా తమ క్లయింట్లకు సేవలను అందిస్తోంది.  కొత్త కేంద్రంతో హైదరాబాద్ లో హెచ్సీఎల్ మొత్తం అయిదు సెంటర్లను విస్తరించనుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్