‘ఊరు పేరు భైరవకోన’తో బ్లాక్ బస్టర్ అందించారు

- Advertisement -

అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం 27, TFIలో మోస్ట్ క్రేజియెస్ట్ మెగా బడ్జెట్ ప్రాజెక్ట్‌, దర్శకుడు విఐ ఆనంద్‌ పుట్టినరోజున అనౌన్స్ మెంట్, త్వరలో ప్రారంభం

దర్శకుడు విఐ ఆనంద్ తన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’తో బ్లాక్ బస్టర్ అందించారు, ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అతని కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఊరు పేరు భైరవకోన చిత్రాన్ని సమర్పించిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకరతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.రాజేష్ దండా, అజయ్ సుంకర సహ నిర్మాతలుగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రానికి డైలాగ్స్ అందించిన అబ్బూరి రవి కొత్త సినిమాకు కూడా పని చేయనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఏ టీవీ సమర్పిస్తోంది.  విఐ ఆనంద్ సూపర్ నేచురల్ అడ్వంచర్స్ చేయడంలో దిట్ట. ఈ కొత్త చిత్రం కథ, సెటప్ పరంగా యూనిక్ గా ఉండబోతోంది. ఈ మెగా-బడ్జెట్ వెంచర్ TFIలో మోస్ట్  క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవబోతోంది.ఈ సినిమా హీరో, ఇతర వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular