ఏసీబీకి దొరికిన ఆరోగ్య శాఖ అధికారి
ఆదిలాబాద్
Health department official caught by ACB
కొద్ధి రోజుల క్రితం గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ మహిళకు అబార్షన్ చేసి ఆమె మృతికి కారకుడైన ఆర్ఎంపీ వైద్యుడి కేసులో సదరు వైద్యునికి మందులు అందించిన మెడికల్ షాప్ యజమానిని కేసు నుంచి తప్పించేందుకు లంచం డిమాండ్ చేసిన ఆరోగ్య శాఖ అధికారి రవి శంకర్ ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికి పోయారు. సదరు అధికారి బాధితుడిని కేసు నుంచి తప్పించేందుకు లక్ష రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులు ఆశ్రయించాడు. శుక్రవారం బాధితుడు లంచం సొమ్ములో కొంతభాగం 30 వేల రూపాయలు ఇస్తుండగా ఎసిబి డిఎస్పీ విజయ్ కుమార్, సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేసి నిండుతుడిని రెడ్ హ్యాండ్ గా పట్టుకొని లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడి పై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.