ఎస్సార్‌నగర్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీన

- Advertisement -

ఎస్సార్‌నగర్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీన
12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల అరెస్ట్
హైదరాబాద్‌ డిసెంబర్ 18
నగరంలో నార్కోటిక్ బ్యూరో అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్‌ని పట్టుకున్నారు. ఎస్సార్‌నగర్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో నార్కోటిక్ బ్యూరో అధికారులు డ్రగ్స్‌ని స్వాధీన

పరుచుకున్నారు. బర్త్‌ డే పార్టీ కోసం గోవా నుంచి యువకులు డ్రగ్స్ తీసుకువచ్చారు. పట్టుబడిన నిందితులది నెల్లూరు జిల్లా అని నార్కోటిక్ బ్యూరో తెలిపింది. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు నార్కోటిక్ బ్యూరో చెప్పింది. ప్రేమ్ చంద్ బర్త్ డే కోసం గోవా నుంచి సంపత్ డ్రగ్స్ తెప్పించాడు. 30 మంది కోసం డ్రగ్స్ పార్టీని ప్రేమ్ చంద్ ఏర్పాటు చేశారు. ప్రముఖ

సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్లు అందరూ కలిపి ఈ పార్టీ చేసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular