గుంటూరు నుంచి గుండె తిరుపతికి
సీఎం జగన్ చోరవతో హెలికాప్టర్ లో
గుంటూరు: ఒక ప్రాణం నిలిపేందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత దూరమైనా వెళ్తారని మరోసారి నిరూ పించారు.తిరుపతిలో గుండె మార్పిడి అవసర మైన వ్యక్తి కోసం గుంటూరు నుండి ఏకంగా ప్రత్యేక హెలీకాప్టర్ ద్వా రా గుండె తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రోడ్డు మార్గం ద్వారా తరలిం చేసరికి విలువైన సమయం వృథా అవుతుందని ఆఘమేఘాల మీద హెలీకాప్టర్ ను రప్పించి, గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి శస్త్ర చికిత్సకు మార్గం సుగమం చేశారు.ప్రస్తుతం తిరు పతి లోని పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆసు పత్రిలో శస్త్ర చికిత్సను అందించా రు. గుంటూరులో ప్రమాద వశాత్తూ బ్రెయి న్ డెడ్ అయిన 18 ఏళ్ల కట్టా కృష్ణ అనే యువకుడి అవయవాలు దానం చేసేం దుకు అతని కుటుంబ సభ్యులు ముం దుకొచ్చారు. అతని గుండె మార్పిడి చేసి తిరుపతికి చెందిన 33 ఏళ్ల వ్యక్తిని బతి కించేందుకు సీఎం ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు.పేద లకు కేవలం కార్పొరేట్ వైద్యం అందించడమే గాక.. కార్పొరే ట్ ఆసుపత్రులు సైతం చేయని అద్భు తాలు తన మంచి హృదయంతో చేయగలనని చాటి చెప్పా రు.