- Advertisement -
షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్యకు హృదయపూర్వక అభినందనలు
Heartiest congratulations to Shad Nagar MLA Shankaraiah
సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పెండ్ర వీరన్న
హైదరాబాద్
ఇటీవల తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కె.శంకరయ్య శాసనసభ సమావేశాల్లో సంచార జాతులకు సంబంధించిన అంశాలపై మాట్లాడటం జరిగింది ఆ సందర్భంగా ది 29-11-2024 తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సంచార జాతుల సంఘం అధ్యక్షులు ఓరుగంటి రమేష్ ఆధ్వర్యంలో, ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పెండ్ర వీరన్న, షాద్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కె.శంకరయ్య గారిని, వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేస్తూ, 1956 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదిమతెగలను, సంచార జాతులను షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చాలని, కేంద్ర ప్రభుత్వానికి, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన సిఫారసులను పున పరిశీలించి, మా ఆదిమ తెగలు, సంచార జాతులను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే కె.శంకరయ్య ని కోరడం జరిగింది, ఆయన సానుకూలంగా స్పందిస్తూ త్వరలో తప్పనిసరి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో బలంగా మాట్లాడతానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంటెద్దు రాంబాబు, పిట్టల దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు
- Advertisement -