- Advertisement -
ఏపీలో భారీగా మద్యం దరఖాస్తులు
Heavy liquor applications in AP
విజయవాడ, అక్టోబరు11, (వాయిస్ టుడే)
కొత్త షాపులు, కొత్త బ్రాండ్లు, కొత్త ధరలు, కొత్త మద్యం, కొత్త విధానం రాబోతోంది. ఏపీలో మద్యం షాపులకు విదేశాల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. యూరప్, అమెరికా నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు నమోదయ్యాయి. అమెరికా నుంచి 20 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మద్యం షాపుల టెండర్లకు సంబంధించి దరఖాస్తు గడువు సమీపిస్తోంది. ఈ క్రమంలో ఎక్కువ మంది దరఖాస్తులు వేస్తున్నారు. ఇప్పటివరకు 70వేలకు పైగా టెండర్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 1500 కోట్ల రూపాయలకుపైగా డిపాజిట్లు వచ్చినట్లుగా సమాచారం. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.ఏపీలో మద్యం దుకాణాల కోసం ప్రవేశపెట్టిన కొత్త విధానం. ఏపీలో మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇప్పటికే దరఖాస్తులను కూడా స్వీకరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు.. కోకొల్లలు వస్తున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ దరఖాస్తులు సమర్పించేందుకు ఎవరైనా నాన్ రిఫండబుల్ ఫీజు అక్షరాలా రూ. 2 లక్షలు చెల్లించాలి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 దుకాణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది.ఈ దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తులను 14వతేదీన అందరి ముందు ఎక్సైజ్ అధికారులు లాటరీ తీసి, దుకాణదారులను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ నెల 16 నుండి ఈ ప్రక్రియతో ప్రారంభమయ్యే మద్యం షాపులు ప్రారంభం కావచ్చు. అయితే.. దరఖాస్తు గడువును ప్రభుత్వం పెంచే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.అయితే ఎలాగైనా మద్యం షాపును చేజిక్కించుకోవాలనుకున్న వ్యాపారస్తులు.. తమ దరఖాస్తులను తమ పేరిట.. అలాగే కుటుంబ సభ్యుల పేరిట కూడా అందించి.. తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారట. అసలే ఆదాయం లేని ప్రభుత్వానికి ఈ మద్యం స్కీం.. ఆదాయాన్ని బాగానే తెచ్చిపెడుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సుమారు 42 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని.. దీనితో సుమారుగా రూ. 830.96 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని తెలుస్తోంది.అయితే ఇక్కడే సూపర్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఏపీలోని మద్యం షాపులకు కేవలం రాష్ట్ర ప్రజల నుండే కాకుండా.. విదేశాల నుండి కూడా దరఖాస్తులు వస్తున్నాయట. మద్యం షాపుల కోసం యూరప్, అమెరికా దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా తమ దరఖాస్తులను ఎక్సైజ్ శాఖకు పంపిస్తున్నారని అధికారులు తెలుపుతున్నారు. అమెరికా నుండి తమకు 20 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి తెలిపారు.ఏపీ మద్యం కొత్త పాలసీ క్రేజ్ విదేశాలకు కూడా పాకిందంటే.. అసలు మద్యం షాపుల ఏర్పాటుకు ఔత్సాహికులు ఏవిధంగా ముందుకు వస్తున్నారో చెప్పనవసరం లేదు. ఏది ఏమైనా.. కూటమి ప్రభుత్వం మందుబాబులకు కూడా ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించింది. అసలుసిసలైన బ్రాండ్ మద్యం మీ చెంతకు చేరుస్తాం.. ధరలు తగ్గిస్తాం అంటూ మందుబాబులపై వరాలజల్లు కురిపించింది. అందుకే మందుబాబులు కూడా హమ్మయ్య.. త్వరగా లాటరీ తీయాలి.. ఇక బ్రాండెడ్ కిక్కు కావాలనే రీతిలో.. కొత్త మద్యం షాపుల కోసం వెయిటింగ్ లో ఉన్నారట.
- Advertisement -