హిందూపురంలో భారీ వర్షం
Heavy rain in Hindupur
ఏకతాటిగా గంటపాటు ఉరుములతో కూడిన వర్షం
హిందూపురం
హిందూపురంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. వేకువ జాము నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని హస్నాబాద్, శ్రీకంఠాపురం, రైల్వే రోడ్డు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరాయి. ఒక్కసారిగా ఏకధాటిగా ఉరుములతో కూడిన భారీ వర్షానికి వర్షపు నీరు ఇళ్లలోకి చేరాయి. అహ్మద్ నగర్ లో ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యవసర సరుకులు అన్ని తడిసి ముద్దయ్యాయి. బియ్యం, దుస్తులు తడిసిపోయాయి.
ప్రభుత్వ పాఠశాలలోకి వర్షపు నీరు చేరాయి. హిందూపురం స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న అండర్ గ్రౌండ్ లోకి వర్షపు నీరు చేరడంతో మోటార్ సహాయంతో వర్షపు నీటిని బయటకుతోడేస్తున్నారు. లేపాక్షి, చిలమత్తూరు మండలాలలో ఇదేవిధంగా భారీ వర్షాలు కురిసాయి.