- Advertisement -
మహబూబాబాద్ జిల్లాలో కుండపోత వర్షం
Heavy rain in Mahabubabad districtమహబూబాబాద్
మహబూబాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. 179.0మీ.మీటర్ల వర్షపాతం నమోదు అయింది.బ దీంతో పట్టణంలో పలు కాలనీలు జలమయయ్యాయి. వాగులు చెరువులు పొంగిపోర్లుతున్నాయి. చిన్న గూడూరులో జిళ్ళేళ్ళ వాగు, తాళ్ళపూసపల్లి వంతెనపై ఉదృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. మహుబూబాద్-తొర్రూర్ రాకపోకలకు అంతరాయం కలిగింది. ఖమ్మం జిల్లాలో తీగల బంజర వాగుకు వరద పోటెత్తింది. వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఖమ్మం జిల్లా అంజనపురం లో వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. వరద నీరు వంతెన పై నుంచి ప్రవహిస్తుంది.
- Advertisement -




