తెలంగాణలో రాబోయే ఐదురోజుల పాటు భారీ వర్షాలు

- Advertisement -

తెలంగాణలో రాబోయే ఐదురోజుల పాటు భారీ వర్షాలు
ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ
హైదరాబాద్/అమరావతి  సెప్టెంబర్ 5

Heavy rains in Telangana for the next five days

తెలంగాణలో రాబోయే ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్నటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని.. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతిదిశగా వంగి ఉందని.. రాబోయే రెండురోజుల్లో ఉత్తర దిశగా వైపు కదులుతుందని తెలిపింది. ఇక రుతుపవన ద్రోణి సూరత్‌గఢ్‌, రోహ్‌తక్‌, ఒరై, మండ్లా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలోని అల్పపీడన కేంద్రం నుంచి ప్రయాణిస్తూ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని తెలిపింది. తెలంగాణలో గురువారం నుంచి ఈ నెల 9 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని చెప్పింది. ఆసిఫాబాద్‌, నిర్మల్‌,నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, హైదరాబాద్‌, భువనగిరి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే, ఈ నెల 9 వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular