- Advertisement -
తిరుమలలో భారీ వర్షం
Heavy rains in Tirumala
తిరుమల
గురువారం ఉదయం తిరుమలలో భారీ వర్షం కురిసింది. దాంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. దానికి తోడు చలి తీవ్రత పెరిగింది. ఘాట్ రోడ్డులలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండడంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేసారు. గోగర్భం, పాపవినాశనం పూర్తిగా నిండిపోయాయి.
- Advertisement -


