Heavy rains: జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది వికారాబాద్, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలలో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మొత్తం 13 జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Heavy rains.. Thunderstorms.. Be careful!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెదురు మదురుగా వర్షాలు పడుతున్నాయి. 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పిన విషయం తెలిసిందే. నైరుతి రుతుపవనాలకు తో పాటు ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఇక హైదరాబాద్లో వాతావరణం చూస్తే ఉదయం వాతావరణం పొడిగాను సాయంత్రం వర్షం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈసారి వర్షాకాలంలో వర్షాలు ఆశించిన మేరకు నమోదు కాని కారణంగా వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడైనా ఆశించిన మేర వర్షాలు కురిస్తే రైతులకు కాస్త ఉపశమనం దొరుకుతుంది.
పిడుగులు పడే అవకాశం .. జాగ్రత్త భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 30 నుండి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెబుతున్నారు. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షాల కారణంగా వ్యవసాయ పనులు చేసే రైతులు, గొర్రెల, పశువుల కాపరులు చెట్ల కిందకు వెళ్ళొద్దని సూచిస్తున్నారు. పొలం పనులు చేసేవారు జాగ్రత్త అవసరమైతేనే బయటకు వెళ్లాలని పొలం పనులు చేసుకునే వారి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.