Thursday, November 7, 2024

మంత్రుల మధ్య హెలికాఫ్టర్ ఫైట్

- Advertisement -

మంత్రుల మధ్య హెలికాఫ్టర్ ఫైట్

Helicopter fight between ministers

హైదరాబాద్, నవంబర్ 7, (వాయిస్ టుడే)
ఉన్నది ఒక్కటే హెలికాప్టర్. సీఎం సహా 11మంది మంత్రులు ఏ లాంగ్‌ టూర్‌కు వెళ్ళినా ఆ హెలికాప్టర్‌ను వాడాలి. అయితే కొందరు మంత్రులకు హెలికాప్టర్ ఇచ్చి..మరి కొందరికి మాత్రం హెలికాప్టర్‌ ఇవ్వకపోవడంతో రచ్చ స్టార్ట్‌ అయిందట. ఇదేంటి మేము మంత్రులం కాదా..మాకు హెలికాప్టర్ వాడే అర్హత లేదా..నాకు హెలికాప్టర్‌ ఇవ్వొద్దని నీకు ఎవరు చెప్పారు అంటూ అధికారుల మీద గుస్సా అవుతున్నారట మంత్రులు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం ప్రభుత్వ హెలికాప్టర్‌ను యూజ్ చేస్తున్నారు. సీఎం పర్యటనలు లేనప్పుడు, హెలికాప్టర్ ఖాళీగా ఉంటే మంత్రులు ఉపయోగించే వెసులుబాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒక మంత్రి కాకుండా ఇద్దరు ముగ్గురు మంత్రులు, ఉన్నతాధికారులు కలసి..హైదరాబాద్‌కు దూరంగా ఉన్న జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావాల్సి వచ్చినప్పుడు హెలికాప్టర్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుందట. అందుకు ప్రత్యేకంగా నిబంధనలు ఏమీ లేవని అధికారులు చెబుతున్నారు.కొన్ని కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు తరచూ హెలికాప్టర్‌ను వాడుతున్నారు. దూర ప్రాంతాలకే కాదు దగ్గరలో ఉన్న జిల్లాలకు కూడా హెలికాప్టర్‌లోనే వెళ్తున్నారు. నలుగురైదుగురు మంత్రులు మాత్రమే రెగ్యులర్‌గా హెలికాప్టర్ వాడుకోవడం, మిగతా మంత్రులకు ఆ అవకాశం రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం అవుతోందట. వెసులుబాటును బట్టి అత్యవసరం అయితే తప్ప, లేకపోతే మంత్రుల బృందం వెళ్లే ప్రత్యేక సందర్భాల్లో సర్కార్ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తుంటారని అధికారులు చెబుతున్నారు. కానీ కొంతమంది మంత్రులు సాధారణ ప్రభుత్వ కార్యక్రమాలకు, హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న జిల్లాలకు కూడా హెలికాప్టర్‌లో వెళ్తున్నారటమంత్రులు హెలికాప్టర్‌ను వాడుకునేందుకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ..కొందరికి మాత్రమే హెలికాప్టర్ ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయట. కొంతమంది మంత్రులు దూరంలో ఉన్న జిల్లాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లాల్సి వచ్చినా హెలికాప్టర్ ఇవ్వడం లేదని వాపోతున్నారట. దీంతో కొందరికి మాత్రమే హెలికాప్టర్‌లో వెళ్లే వెసులుబాటు కల్పించి, మిగతా వారి పట్ల వివక్ష చూపుతున్నారని ప్రోటోకాల్ అధికారులపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.అంతేకాకుండా మిగతా మంత్రులు తరచూ హెలికాప్టర్ వాడుకోవడం, హైదరాబాద్‌ దగ్గర ప్రాంతాలకు కూడా హెలికాప్టర్‌లో వెళ్లడంపై ప్రజల్లోనూ తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని ఓ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. అప్పటి నుంచి రెగ్యులర్‌గా హెలికాప్టర్ వాడే మంత్రులు కూడా ఇప్పుడు రోడ్డు మార్గంలోనే వెళ్తున్నారని తెలుస్తోంది. ఈ మార్పునకు సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షనే కారణమా లేక ఇంకేదైనా రీజన్‌ ఉందా అన్నది మాత్రం అధికారులు చెప్పడం లేదు. మొత్తానికి హెలికాప్టర్ విషయంలో మంత్రుల మధ్య వచ్చిన పొరపొచ్చాలకు పులిస్టాప్ పడినట్టేనని తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్