- Advertisement -
పెద్ద చెరువు ముంపు బాధితులను ఆదుకోవాలి
Help the flood victims of the big pond
సంగారెడ్డి
మూడు దశాబ్దాల క్రితం కొన్న ప్లాట్లు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ముంపు ప్రాంతాలుగా మారిపోయాయని, తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని అమీన్ పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు ఇరిగేషన్ కార్యాలయం వద్ద అమీన్ పూర్ పెద్ద చెరువు ముంపు భాదితుల జేఏసీ ఛైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గత పది రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్ద చెరువు పరిశీలించి ముంపు భాదితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం సరి అయిన విధంగా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని అమీన్ పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ డిమాండ్ చేశారు.
- Advertisement -