పోలీసుల అదుపులో హేమ
బెంగళూరు, జూన్ 3
బెంగుళూరు రేవ్ పార్టీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం 100 మందికి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 86 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఇందులో ఎక్కువగా తెలుగువారు, టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉండడంతో సినీ పరిశ్రమను షేక్ చేసింది. ఈ కేసులో ప్రముఖంగా నటి హేమ పేరు మారుమోగింది. బెంగుళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు పోలీసులు తెలుపగా.. అక్కడ తను లేనంటూ బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టడంతో హేమ ప్లాన్ బెడిసికొట్టింది. ఇక రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఆమెకు పోలీసులు నోటీసులు పంపించారు. మే 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపించగా.. గైర్హాజయ్యింది. తాజాగా నటి హేమకు బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఈ కేసులో నటి హేమను బెంగుళూరు సీసీబీ పోలీసులు విచారిస్తున్నారు. గతంలో విచారణకు హాజరుకావాలంటూ రెండు సార్లు నోటీసులు పంపగా వివిధ కారణాలతో రెండు సార్లు విచారణకు హాజరుకాలేదు. ఇక ఇప్పుడు థర్డ్ నోటీస్ కు విచారణకు హజరయ్యింది నటి హేమ. ఈరోజు ఉదయం బెంగళూరు పోలీసుల ముందు హాజరైనట్లు తెలుస్తోంది.
పోలీసుల అదుపులో హేమ
- Advertisement -
- Advertisement -