- Advertisement -
హైదరాబాద్: ఎన్నికల విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం ఇస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల ఫలితాలపై మీడియాతో ఆయన మాట్లాడారు. “ఇక సచివాలయం గేట్లు సామాన్యుల కోసం తెరుచుకుంటాయి. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం. మానవహక్కులను కాపాడుతాం. ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీలను నెరవేరుస్తాం. ప్రగతిభవన్ పేరును అంబేడ్కర్ భవన్ గా మారుస్తాం. ఇక నుంచి ప్రగతి భవన్.. ప్రజా భవన్ అవుతుంది. పార్టీని విజయం వైపు నడించిన ఠాక్రే, ఇతర నేతలకు కృతజ్ఞతలు. కాంగ్రెస్ గెలుపుపై కేటీఆర్ స్పందను స్వాగతిస్తున్నా” అని రేవంత్ తెలిపారు.
- Advertisement -



