20 C
New York
Tuesday, May 28, 2024

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఎ వైరస్ 12మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడి

- Advertisement -

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఎ వైరస్
     12మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడి
తిరువనంతపురం మే 16
కేరళలో లో హెపటైటిస్ ఎ వైరస్ విజృంభిస్తుంది. అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే  12మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది మొదటి నాలుగున్నర నెలల్లో రాష్ట్రంలో 1,977 కేసులు బయటపడ్డాయి.ఈ క్రమంలో అత్యధిక కేసులు నమోదైన కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాలకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో వైరస్ కట్టడికి క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారును ఆదేశించారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లోని నీటి వనరులను క్లోరినేషన్ చేస్తామని, రెస్టారెంట్లకు ఉడికించిన నీటిని మాత్రమే సరఫరా చేయాలని చెప్పినట్లు ఆమె తెలిపారుహెపటైటిస్ ఎ వైరస్ కాలేయంపై ప్రభావం చూపుతుంది. ఇది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా లేదా అంటువ్యాధి కలిగిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది.కాగా, ఈ సంవత్సరం రాష్ట్రంలో మరో 5,536 అనుమానిత కేసులు నమోదైనట్లు తెలు్తోంది. మరో 15 మంది ఈ వైరస్ కారణంగా మరనించినట్లు అనుమానిస్తున్నారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!