Monday, February 16, 2026

వాగు అవతల అడవిలో చిక్కుకున్నల  పశువుల కాపరులు, పశువులు, మూగ జీవాలు

- Advertisement -

వాగు అవతల అడవిలో చిక్కుకున్నల  పశువుల కాపరులు, పశువులు, మూగ జీవాలు

Herdsmen, cattle, dumb creatures trapped in the forest beyond the stream

భద్రాద్రి
భారీ వర్షం కారణంగా జూలూరుపాడు మండలం ఎలకలొడ్డు అటవీ ప్రాంతంలోని పోలారం చెరువు వాగు ఉధృతి కారణంగా వాగు అవతల 10మంది పశువుల కాపరులు, సుమారు 300 మూగ జీవాలు, పశువులు చిక్కుకున్నాయి. దీనితో సమాచారం తెలుసుకున్న జూలూరుపాడు ఎస్సై రానా ప్రతాప్ తన సిబ్బందితో చిమ్మ చీకట్లో, అటవీ ప్రాంతంలోకి వెళ్లి వాగు అవతల చిక్కుకున్న వారిని కాపాడారు. వాగుకు ఒక్కసారిగా భారీగా వరదరావడంతో వాగు దాటడానికి అవకాశం లేక అడవిలో చిక్కుకున్న మనుషులు, మూగ జీవాలు చీకటి పడటంతో భయాందోళన చెందడం తో గ్రామస్తులకు సమాచారం. అందించారు. గ్రామస్తులు సమాచారం తెలపడంతో జూలూరుపాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ సిబ్బందితో కలిసి భారీ వర్షంలో ఆ ప్రాంతానికి హుటా హుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీస్ వాహనాల వెలుతురులో వాగు అవతలి వైపు నుంచి జీవాలను, మనుషులను ఇవతిలివైపుకు శ్రమించి  సురక్షితంగా తీసుకువచ్చారు. భయాందోళనలో ఉన్న వ్యక్తులకు ధైర్యం చెప్పి ఇంటికి చేర్చడంతో ఎస్సై రాణా ప్రతాప్, సిబ్బందికి గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్